దసరా సినిమాలోని ఆ సీన్స్ తీసేయాల్సిందే

Nani and Keerthy Suresh Starrer Dasara Movie. నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘దసరా’ చిత్రం మార్చి 30న విడుదలై.. భారీ కలెక్షన్స్

By Medi Samrat
Published on : 2 April 2023 6:45 PM IST

దసరా సినిమాలోని ఆ సీన్స్ తీసేయాల్సిందే

నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘దసరా’ చిత్రం మార్చి 30న విడుదలై.. భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. ‘దసరా’ చిత్రంలో ఫిమేల్ లీడ్‌గా నటించిన కీర్తి సురేష్ అంగన్‌వాడీ టీచర్‌గా కనిపించింది. ఒక సీన్‌లో ఆమె అంగన్‌వాడీ కేంద్రంలోని గుడ్లు, ఇతరత్రా సరుకులు దొంగిలించినట్లుగా చూపించారు. అంగన్‌వాడీ ఎంప్లాయ్‌ను దొంగగా చూపించడం పట్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అంగన్‌వాడీ ఉద్యోగులు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. తక్షణమే ఆ సీన్లను తొలగించాలని లేదంటే దసరా చిత్ర ప్రదర్శన నిలిపివేస్తామని అంగన్‌వాడీ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.

దసరా సినిమాకు 3 రోజుల‌లో రూ.68.45 కోట్లు వ‌చ్చాయి. తొలి రోజున‌ రూ.38 కోట్ల రూపాయ‌ల గ్రాస్‌ను వ‌సూలు చేసిన ద‌స‌రా.. రెండో రోజున దాదాపు రూ.15 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. మూడు రోజున రూ.16 కోట్లు వ‌చ్చాయ‌ని ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. ఈ సినిమా రూ.48 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జ‌రుపుకుంది.


Next Story