కళ్యాణ్ రామ్ హీరోగా 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా మూవీ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. తల్లి, కొడుకుల సెంటిమెంట్‌తో ఈ యాక్షన్ డ్రామా సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. కల్యాణ్ రామ్‌కు జోడీగా సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
సోహైల్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సమ్మర్‌లో ఈ సినిమా విడుదల కానుంది. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు.. ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కల్యాణ్ రామ్, విజయశాంతి పాత్రలను పరిచయం చేస్తూ విడుదల టీజర్ గుస్‌బంప్స్ తెప్పిస్తోంది. టీజర్‌లోని పవర్ ఫుల్ డైలాగ్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కాగా ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు, టైటిల్ పోస్టర్, ఈ మధ్యనే వదిలిన ప్రీ-టీజర్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి.