నందమూరి చైతన్య కృష్ణ షాకింగ్ రియాక్షన్

తమిళ నటి విచిత్ర ఓ ప్రముఖ తెలుగు హీరో తనని వేధించాడని చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి.

By M.S.R  Published on  25 Nov 2023 8:00 PM IST
నందమూరి చైతన్య కృష్ణ షాకింగ్ రియాక్షన్

తమిళ నటి విచిత్ర ఓ ప్రముఖ తెలుగు హీరో తనని వేధించాడని చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి. తన కెరీర్ స్టార్టింగ్‌లో ఓ తెలుగు సినిమాలో నటించానని ఆ సినిమాలోని హీరో తనని వేధించినట్లు విచిత్ర తెలిపింది. ఆ హీరో ప్రపోజల్ కు తాను ఒప్పుకోకపోతే షూటింగ్ సమయంలో నన్ను చాలా ఇబ్బంది పెట్టారని.. ఆ హీరో రోజూ తాగొచ్చి నా రూమ్ డోర్ కొట్టేవాడని వెల్లడించింది. అయితే ఆమె ఆరోపణలు చేసింది టీడీపీ ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ మీదనే అని కొన్ని మీడియా సంస్థలు కథనాలను రాసుకొచ్చాయి. విచిత్ర తమిళంలో కాకుండా వేరే భాషలో నటించిన ఏకైక చిత్రం తెలుగులోనే. అది కూడా బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘భలేవాడివి బాసూ’. ఈ సినిమాలో శిల్పాషెట్టి, అంజల ఝవేరీ హీరోయిన్‌లుగా న‌టించ‌గా న‌టి విచిత్ర గిరిజన యువతి పాత్రలో కనిపించింది.

అయితే ఊహించని విధంగా నందమూరి చైతన్య కృష్ణ రియాక్ట్ అయ్యారు. ఆమె చేసిన కామెంట్లను చైతన్య కృష్ణ తోసిపుచ్చాడు. ఆయన అలా వల్గర్‌గా ప్రవర్తించరు.. బాబాయ్‌ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వరుసగా మూడు సినిమాలు హిట్ అయ్యాయని.. అందుకే ఇలా ఆరోపణలు చేసి డౌన్ చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు నందమూరి చైతన్య కృష్ణ. ఆయన సినిమాల సమయంలో ఇలాంటివి ఉండవు అంటూ చైతన్య కృష్ణ చెప్పుకొచ్చారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

Next Story