బాల‌కృష్ణ‌కు మ‌రో స‌ర్జ‌రీ.. వాస్త‌వం కాదు.. రెగ్యుల‌ర్ చెక‌ప్ కోస‌మే ఆస్ప‌త్రికి

Nandamuri Balakrishna undergoes knee surgery.నందమూరి బాలకృష్ణ ప్ర‌స్తుతం పుల్ బిజీగా ఉన్నారు. గోపిచంద్ మ‌లినేని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 April 2022 3:52 AM GMT
బాల‌కృష్ణ‌కు మ‌రో స‌ర్జ‌రీ.. వాస్త‌వం కాదు.. రెగ్యుల‌ర్ చెక‌ప్ కోస‌మే ఆస్ప‌త్రికి

నందమూరి బాలకృష్ణ ప్ర‌స్తుతం పుల్ బిజీగా ఉన్నారు. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య ఓ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓ ప‌క్క సినిమాలు, మ‌రో ప‌క్క రాజ‌కీయాల‌తో పుల్ యాక్టివ్‌గా ఉన్నారు బాల‌య్య‌. అయితే.. బాల‌కృష్ణ గ‌త కొద్ది రోజులుగా మోకాలి నొప్పితో బాధ‌ప‌డుతున్నార‌ని, దీంతో ఇటీవ‌ల ఆయ‌న‌కు వైద్యులు స‌ర్జ‌రీ చేశార‌ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. బాల‌య్య మెకాలికి నీ ప్యాడ్ ధ‌రించి ఉన్న ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో బాల‌య్య‌కు ఏమైందోన‌నే కంగారు అభిమానుల్లో మొద‌లైంది.

దీనిపై ఆయ‌న త‌రుపు ప్ర‌తినిధులు స్పందించారు. బాలయ్యకు సర్జరీ జరగలేదని, కేవలం రెగ్యులర్‌ చెకప్‌ కోసం ఆస్పత్రికి వెళ్లారని తెలిపారు. ఇలాంటి అవాస్త‌వాల‌ను వ్యాప్తి చేయొద్ద‌ని కోరారు. కాగా.. బాల‌య్య ప్ర‌స్తుతం గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. బాల‌య్య కెరీర్‌లో 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. సార‌థి స్టూడియోలో జ‌రుగుతున్న షూటింగ్‌లోనూ బాల‌య్య పాల్గొన్నార‌ని వారు తెలిపారు.

కాగా.. గతంలో 'అఖండ' సినిమా చిత్రీకరణలో జరిగిన ఓ ప్రమాదంలో బాలకృష్ణ కుడిభుజానికి గాయకావడంతో హైదరాబాద్‌ కేర్‌ హాస్పిటల్‌ వైద్యులు శస్త్ర చికిత్స చేసిన విషయం తెలిసిందే.

Next Story