బాలయ్య స్పీడ్ పెంచేశాడు.. వయొలెన్స్ కూడా..!

నందమూరి బాలకృష్ణ వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్నారు.

By Medi Samrat  Published on  8 Nov 2023 7:45 PM IST
బాలయ్య స్పీడ్ పెంచేశాడు.. వయొలెన్స్ కూడా..!

నందమూరి బాలకృష్ణ వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. అఖండ, వీర సింహా రెడ్డి చిత్రాలతో వంద కోట్ల గ్రాస్ మార్క్ సాధించాడు. ఇక ఇప్పుడు భగవంత్ కేసరి కూడా వంద కోట్ల గ్రాస్ మార్క్‌ని క్రాస్ చేసింది. హ్యాట్రిక్ హిట్లతో బాలయ్య జోరు మీద ఉండగా.. వాల్తేరు వీరయ్య హిట్ తో బాబీ కూడా హిట్ ట్రాక్ మీద ఉన్నారు. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారని.. కొన్ని నెలల క్రితమే కన్ఫర్మ్ అవ్వగా.. సినిమా షూటింగ్ మొదలైందని చిత్రయూనిట్ ప్రకటించింది.

సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక మూవీ షూటింగ్ మొదలైందంటూ వదిలిన పోస్టర్, డైలాగ్ అదిరిపోయింది. బ్లడ్ బాత్‌కా బ్రాండ్ నేమ్.. వయలెన్స్ కా విజిటింగ్ కార్డ్ అంటూ సినిమా గురించి చెప్పేశారు. నందమూరి నటసింహంతో కొత్త జర్నీ ప్రారంభం అయింది.. అందరి ఆశీస్సులు కావాలి అంటూ బాబీ ట్వీట్ చేశాడు. పోస్టర్ లో పదునైన గొడ్డలి, ఆంజనేయ స్వామి తాయెత్తును చూడవచ్చు. గొడ్డలిపై ఉంచిన కళ్ళద్దాలలో నరసింహ స్వామి ఉగ్రరూపం కూడా చూడవచ్చు.

Next Story