'ది ఘోస్ట్‌' ట్రైలర్‌ రిలీజ్‌.. హైలెవల్‌లో యాక్షన్‌ సీన్స్‌

Nagarjuna 'The Ghost' movie trailer release. అక్కినేని నాగార్జున మెయిన్‌ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'ది ఘోస్ట్‌'. సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న

By అంజి  Published on  25 Aug 2022 9:14 PM IST
ది ఘోస్ట్‌ ట్రైలర్‌ రిలీజ్‌.. హైలెవల్‌లో యాక్షన్‌ సీన్స్‌

అక్కినేని నాగార్జున మెయిన్‌ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'ది ఘోస్ట్‌'. సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ మూవీ ట్రైలర్‌ను సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు లాంఛ్‌ చేశాఉ. దుబాయ్‌ ఎడారిలో ఫైట్‌ సీక్వెన్స్‌తో మొదలైన.. ట్రైలర్‌ ఆద్యంతం ఫ్యామిలీ ఎమోషన్స్‌, యాక్షన్‌ పార్టుతో సాగింది. ఈ మూవీలో ఇంటర్‌ పోల్‌ ఆఫీసర్‌గా విక్రమ్‌గా నాగార్జున కనిపించబోతున్నాడు.

ఈ మూవీకి మార్క్ కే రాబిన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దుబాయ్ బ్యాక్ డ్రాప్‌లో వ‌చ్చే సీన్లు సినిమాకు హైలెట్‌గా నిలువ‌నున్నాయ‌ని ట్రైల‌ర్‌ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్‌గా వ‌స్తున్న ఈ మూవీలో బాలీవుడ్ న‌టి గుల్ ప‌నాగ్‌, కేర‌ళ కుట్టి అనిఖా సురేంద్రన్‌ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ది ఘోస్ట్ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పీ, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్ల‌పై సునీల్ నారంగ్‌, పీ రామ్మోహ‌న్ రావు, శ‌ర‌త్ మ‌రార్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా అక్టోబర్‌ 5న రిలీజ్‌ కానుంది.


Next Story