నాగశౌర్య కొత్త సినిమా లాంఛ్‌.. క్లాప్‌ కొట్టిన వి.వి. వినాయక్‌

Naga Shouryas Ns24 Pooja Ceremony Completed. టాలీవుడ్ యంగ్‌ హీరో నాగశౌర్య రెండ్రోజుల క్రితం తన కొత్త సినిమాని అనౌన్స్ చేస్తూ సోషల్ మీడియాలో

By అంజి  Published on  6 Nov 2022 3:32 PM IST
నాగశౌర్య కొత్త సినిమా లాంఛ్‌.. క్లాప్‌ కొట్టిన వి.వి. వినాయక్‌

టాలీవుడ్ యంగ్‌ హీరో నాగశౌర్య రెండ్రోజుల క్రితం తన కొత్త సినిమాని అనౌన్స్ చేస్తూ సోషల్ మీడియాలో అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇవాళ పూజా కార్యక్రమాలను నిర్వహించి మేకర్స్ అధికారికంగా ఈ సినిమాను ప్రారంభించారు. ఈ వేడుకకు నాగ శౌర్యతో పాటు మేకర్స్, ప్రత్యేక అతిథి వివి వినాయక్ హాజరయ్యారు. మేకర్స్ పూజా కార్యక్రమంలోని కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ''#NS24 అధికారికంగా పూజా కార్యక్రమంతో ఈరోజు ప్రారంభించబడింది.'' అని ట్వీటర్‌లో పోస్టు చేశారు. ఈ సినిమా మొదటి షాట్‌కి స్టార్‌ డైరెక్టర్‌ వివి వినాయక్‌ క్లాప్‌ కొట్టగా, అభిషేక్‌ అగర్వాల్‌ కెమెరా స్విచాన్‌ చేశారు.

ఈ చిత్రానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎస్‌ఎస్ అరుణాచలం చేస్తున్నారు. వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పాటలను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జైరాజ్ ట్యూన్ చేస్తున్నట్లు నిన్న మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో నాగశౌర్య గత చిత్రాలకంటే భిన్నంగా కనిపిస్తాడని చిత్రబృందం వెల్లడించింది. కాగా నాగశౌర్య ఇటీవలే 'కృష్ణ వ్రింద విహారి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు.


Next Story