నాగచైతన్య - శోభిత ఎంగేజ్‌మెంట్‌

తన కుమారుడు నాగచైతన్య - శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగినట్టు అక్కినేని నాగార్జున ప్రకటించారు.

By అంజి  Published on  8 Aug 2024 1:20 PM IST
Naga Chaitanya, Shobhita, Tollywood

నాగచైతన్య - శోభిత ఎంగేజ్‌మెంట్‌

తన కుమారుడు నాగచైతన్య - శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగినట్టు అక్కినేని నాగార్జున ప్రకటించారు. ఇవాళ ఉదయం 9.42 నిమిషాలకు ఈ శుభ కార్యక్రమం నిర్వహించినట్టు ట్వీట్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను నటుడు నాగార్జున సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ఆమెను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నట్టు తెలిపారు. వారిద్దరూ జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని నాగ్‌ ఆశీర్వదించారు. దేవుని ఆశీర్వాదం వాళ్లకు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం సందర్భంగా పలువురు నెటిజన్లు స్పందించారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. నాగ చైతన్యకు గతంలో నటి సమంతతో వివాహం అయ్యింది. పలు కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. ఇక నాగచైతన్య, శోభిత ఎంతోకాలం నుంచి స్నేహితులుగా ఉన్నారు. సినీ ఇండస్ట్రీ విషయానికొస్తే.. శోభిత ధూళిపాళ్ల 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచారు. 2016లో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'తండేల్‌'తో నాగచైతన్య బిజీబిజీగా ఉన్నారు.

Next Story