బాలయ్య కామెంట్స్‌పై నాగచైతన్య రియాక్షన్.. 'వారిని అవమానించడం అంటే'..

Naga Chaitanya responded to Balakrishna's comments. ఇటీవల జరిగిన 'వీర సింహారెడ్డి' మూవీ సక్సెస్‌ ఈవెంట్‌లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌

By అంజి  Published on  24 Jan 2023 2:18 PM IST
బాలయ్య కామెంట్స్‌పై నాగచైతన్య రియాక్షన్.. వారిని అవమానించడం అంటే..

ఇటీవల జరిగిన 'వీర సింహారెడ్డి' మూవీ సక్సెస్‌ ఈవెంట్‌లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. నాన్న గారు, ఆ డైలాగులు, రంగారావు గారు, ఈ అక్కినేని తొక్కినేని అంతా కూడా.. అంటూ బాలకృష్ణ సడెన్‌గా ఏదో ఏదో మాట్లాడేశారు. తాజాగా ఈ కామెంట్స్‌పై అక్కినేని నాగచైతన్య రియాక్ట్‌ అయ్యారు. ''#ANRLivesOn.. నందమూరి తారకరామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్‌వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం'' అంటూ ప్రకటన విడుదల చేశారు. అక్కినేని అఖిల్‌ కూడా ఇదే ప్రకటన విడుదల చేశారు. దీంతో ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే అక్కినేని ఫ్యామిలీ.. బాలయ్య కామెంట్స్‌పై స్పందించడంతో టాలీవుడ్‌ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.

మూవీ విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ.. సినిమా గురించి చెపుతూ తమ మధ్య రకరకాల విషయాలు చర్చకు వస్తాయి. నాన్న గారు, ఆ డైలాగులు, రంగారావు గారు, ఈ అక్కినేని తొక్కినేని అంతా కూడా.. అంటూ బాలకృష్ణ సడెన్‌గా ఏదో ఏదో మాట్లాడేశారు. పాత సినిమాలకు సంబంధించిన చాలా విషయాలు చర్చించుకున్నాం అని చెప్పే క్రమంలో బాలయ్య ఈ కామెంట్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బాలయ్యపై అక్కినేని ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. నెట్టింట విమర్శలు చేస్తూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు బాలయ్య టార్గెట్ గా కామెంట్లు చేస్తున్నారు.


Next Story