సమంతతో విడాకులపై స్పందించిన నాగచైతన్య.. ఇద్దరి మంచికే అంటూ

Naga Chaitanya Reaction on Divorce with Samantha.అక్కినేని నాగ‌చైత‌న్య, స‌మంత లు విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jan 2022 5:50 PM IST
సమంతతో విడాకులపై స్పందించిన నాగచైతన్య.. ఇద్దరి మంచికే అంటూ

అక్కినేని నాగ‌చైత‌న్య, స‌మంత లు విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. చాలా రోజుల క్రిత‌మే వీరిద్ద‌రు విడాకులు తీసుకున్న‌ప్ప‌టికీ ఇంకా దీనిపై చాలా మంది మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా నాగ చైతన్య విడాకులపై తొలిసారి నోరు విప్పారు. విడిపోవ‌డం అనేది త‌మ ఇద్ద‌రి మంచి కోసం తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని చెప్పాడు. ప్ర‌స్తుతం నాగార్జున‌, నాగ చైత‌న్య క‌లిసి న‌టిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ 'బంగార్రాజు'. క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో కృతిశెట్టి, ర‌మ్య‌కృష్ణ‌లు క‌థానాయిక‌లుగా న‌టించారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో నాగచైత‌న్య విలేక‌రులతో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా విడాకుల విష‌యం గురించిన ప్ర‌శ్న ఎదురైంది. దీనికి నాగ‌చైత‌న్య స‌మాధానం ఇచ్చారు. అది ఇద్ద‌రి మంచి కోసం తీసుకున్న నిర్ణ‌యం అని అన్నాడు. ప్ర‌స్తుతం ఆమె సంతోషంగా ఉంది. నేనూ సంతోషంగా ఉన్నాను. కెరీర్‌ప‌రంగానూ ఇద్ద‌రం హ్యాపీగానే ఉన్నాం అని స‌మాధానం ఇచ్చారు.

కాగా.. గ‌తేడాది అక్టోబ‌రులో విడాకులు తీసుకుంటున్న‌ట్లు నాగ‌చైత‌న్య‌, స‌మంత జోడి సంయుక్తంగా ప్ర‌క‌టించింది. ఎన్నో చ‌ర్చ‌లు, ఆలోచ‌న‌ల త‌రువాతే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. అయితే.. విడిపోవ‌డానికి గ‌ల కార‌ణాలను మాత్రం చెప్పలేదు. 'ఇక నుంచి మా సొంత మార్గాల్లో ప్ర‌యాణం చేయ‌డానికి భార్యాభ‌ర్త‌లుగా విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నాం. మా మ‌ధ్య ఒక ద‌శాబ్దానికిపైగా స్నేహాం ఉండ‌డం మా అదృష్టం. ఇది మా మ‌ధ్య ప్ర‌త్యేక‌మైన బంధాన్ని నిలిపి ఉంచుతుంద‌ని న‌మ్మ‌కం. ఈ కిష్ణ స‌మ‌యంలో అభిమానులు, శ్రేయాభిలాషుల మ‌ద్ద‌తు కావాలి' అంటూ చైతు, స‌మంత దాదాపు ఒకే ర‌కంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Next Story