నాగ చైతన్య ఎఫైర్స్ గురించి.. నేనెప్పుడూ అలా చెప్పలేదు: సమంత
నాగ చైతన్య ఎఫైర్స్ గురించి వస్తున్న పుకార్లపై హీరోయిన్ సమంత రూత్ ప్రభు కామెంట్ చేసిందని, ఎవరు ఎవరితో డేటింగ్
By అంజి Published on 4 April 2023 5:15 PM ISTనాగ చైతన్య ఎఫైర్స్ గురించి.. నేనెప్పుడూ అలా చెప్పలేదు: సమంత
నాగ చైతన్య ఎఫైర్స్ గురించి వస్తున్న పుకార్లపై హీరోయిన్ సమంత రూత్ ప్రభు కామెంట్ చేసిందని, ఎవరు ఎవరితో డేటింగ్ చేస్తున్నారనే దాని గురించి తాను ఆందోళన చెందనని పేర్కొందని వార్తలు వస్తున్నాయి. దీనిపై సమంత స్పందించింది. 'అసలు ఈ వ్యాఖ్యలు నేను చేయలేదు' అంటూ ట్వీట్ చేశారు. దీంతో సమంతపై వస్తున్న పుకార్లకు చెక్ పడింది. ఎంత మందితో డేటింగ్ చేసినప్పటికీ.. ప్రేమకు విలువ ఇవ్వని వాళ్ళకు చివరకు కన్నీళ్లు మిగులుతాయని, ఎవరు ఎవరితో డేటింగ్ చేస్తే తనకేంటి? అని సమంత చెప్పినట్లు ఓ మీడియా సంస్థ వార్త రాసింది. దీనిపై స్పందిస్తూ సమంత ట్వీట్ చేశారు.
I never said this!! https://t.co/z3k2sTDqu7
— Samantha (@Samanthaprabhu2) April 4, 2023
సమంత రూత్ ప్రభుతో నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత, నటి శోభితా ధూళిపాళతో డేటింగ్ గురించి పుకార్లు వ్యాపించాయి. అయితే, దేవ్ మోహన్‌తో చేయబోయే శాకుంతలం చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్న సమయంలో సమంత ఎట్టకేలకు ఈ పుకార్లపై స్పందించిందని సదరు మీడియా సంస్థ ఓ ఆర్టికల్ రాసింది. ''ఎవరూ ఎవరితో రిలేషన్ షిప్ లో ఉన్నారనే బాధ నాకు లేదని, ప్రేమకు విలువ ఇవ్వని వారు ఎంతమందితో కలిసినా కన్నీళ్లే మిగులుతాయని, కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. తన ప్రవర్తన మార్చుకుని అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అందరికీ మేలు జరుగుతుంది'' అని సమంత అన్నట్లు ఆ వార్త సంస్థ పేర్కొంది.
అయితే గతంలో సమంతా మీడియా ఇంటరాక్షన్ సమయంలో తన విడాకుల గురించి మాట్లాడింది. తాను చాలా కష్టమైన సమయాన్ని అనుభవించానని వెల్లడించింది. నాలుగు సంవత్సరాల వివాహం తర్వాత, ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. సమంత ప్రధాన పాత్రలో నటించిన 'శాకుంతలం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది, ఇది హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఏప్రిల్ 14 న విడుదల కానుంది. ఇంకా సమంత విజయ్ దేవరకొండతో కుషీ, వరుణ్ ధావన్ సరసన సిటాడెల్ సినిమాల్లో నటిస్తోంది.