టాలీవుడ్‌లో విషాదం.. పాత‌త‌రం న‌టుడు క‌న్నుమూత‌

Mutyala Muggu Actor Venkateswara Rao Passed away.టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. పాత‌త‌రం సినీ న‌టుడు, రంగ‌స్థ‌ల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 March 2022 6:02 PM IST
టాలీవుడ్‌లో విషాదం.. పాత‌త‌రం న‌టుడు క‌న్నుమూత‌

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. పాత‌త‌రం సినీ న‌టుడు, రంగ‌స్థ‌ల క‌ళాకారుడు పి.వెంకటేశ్వర రావు క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న కోఠిలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయ‌నకు భార్య ల‌క్ష్మీ, ఐదుగురు ఆడ‌పిల్ల‌లు, ఇద్ద‌రు మ‌గ‌పిల్ల‌లు సంతానం. ఆయ‌న వ‌య‌స్సు 90 సంవ‌త్స‌రాలు.

పి.వెంకటేశ్వర రావు పూర్తిపేరు పిసుపాటి వేంకటేశ్వర రావు. రంగస్థలం కళాకరుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. 'ఇదేమిటి' నాటకంలో ఆంధ్రనాటక కళాపరిషత్‌ వారిచే ఉత్తమ కమెడియన్ అవార్డును, 'మురారి' నాటకంలో నటనకుగాను ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. 'తేనే మ‌న‌సులు' చిత్రంలో హాస్య‌న‌టుడిగా సినీరంగ ప్ర‌వేశం చేశారు. హాస్య న‌టుడిగా కెరీర్ ప్రారంభించినా.. ఆ త‌రువాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు.' కన్నెమనసులు', 'ఆత్మీయులు', 'మరోప్రపంచం', 'సుడిగుండాలు', 'మట్టిలో మాణిక్యం', 'ముత్యాలముగ్గు' చిత్రాల్లో ఆయ‌న న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. కాగా.. వెంకటేశ్వర రావు మృతి ప‌ట్ల ప‌లువురు సినీ, నాట‌క రంగ క‌ళాకారులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

Next Story