నందమూరి బాలకృష్ణ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు ఓ కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చారు. తమన్ టాలెంట్‌ను అభినందిస్తూ నందమూరి బాలకృష్ణ పోర్షే కారును బహుమతిగా అందించారు. రీసెంట్‌గా బాలయ్య ఈ కారును తమన్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
హీరో నందమూరి బాలకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్‌ను ఊపేశాయి. బాలయ్య సినిమాకు తమన్ ఇచ్చే సంగీతం ఓ రేంజ్‌లో ఉంటుంది. థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు బద్దలు అవ్వాల్సిందే. సినిమాతో పాటు వ్యక్తిగతంగా కూడా బాలయ్య, తమన్‌ల మధ్య మంచి రిలేషన్ ఉంది.
తమన్, బాలయ్య కాంబోలో ఇప్పటి వరకు అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలు వచ్చాయి. ఇవి అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి. ప్రస్తుతం బాలయ్య అఖండ 2 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి కూడా తమన్‌నే సంగీతం అందిస్తున్నాడు. అఖండ 2కి కూడా థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు బద్దలు అవుతాయని ఇప్పటికే ఓ సందర్భంలో తమన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.