సినీ నటి ముమైత్‌ఖాన్ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకానుంది. ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చి.. అక్కడి నుంచి నేరుగా ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. మనీలాండరింగ్ కోణంలో ఆమె బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్‌తో బ్యాంకు లావాదేవీలపై కూడా ఈడీ విచారించనుంది. డ్రగ్స్ సరఫరాదారులతో ఆమెకు ఉన్న సంబంధాలపై అధికారులు ముమైత్ ను ప్రశ్నించనున్నారు.
డ్రగ్స్ కేసులో నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పటికే ఈడీ అధికారులు.. పూరీ జగన్నాథ్‌ను 10 గంటల పాటు విచారించారు అధికారులు. మనీ ల్యాండరింగ్‌తో పాటు ఫెమా నిబంధనలు ఉల్లంఘనపై పలు ప్రశ్నలు వేశారు. మనీ ట్రాన్జాక్షన్లపై ఆరా తీశారు. ఆ తర్వాత హీరోయిన్లు ఛార్మిని 8 గంటలు, రకుల్‌ను 7 గంటలు, హీరోలు రానా దగ్గుబాటిని 7 గంటలు, నందును 8 గంటలు, రవితేజను 5 గంటలకు పైగా, నవదీప్‌ను 9 గంటలకు పైగా ఈడీ అధికారులు విచారించారు.