ఆసక్తిరేపుతోన్న అడివి శేష్‌ 'డెకాయిట్‌' పోస్టర్లు

'సీతా రామం', 'ది ఘోస్ట్ స్టోరీస్' తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్ త్వరలో విడుదల కానున్న 'డెకాయిట్' చిత్రంలో అడివి శేష్‌తో కలిసి స్క్రీన్‌ను పంచుకోనున్నారు.

By అంజి  Published on  17 Dec 2024 12:39 PM IST
Mrunal Thakur, Adivi Sesh, Dacoit, Tollywood

ఆసక్తిరేపుతోన్న అడివి శేష్‌ 'డెకాయిట్‌' పోస్టర్లు 

'సీతా రామం', 'ది ఘోస్ట్ స్టోరీస్' తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్ త్వరలో విడుదల కానున్న 'డెకాయిట్' చిత్రంలో అడివి శేష్‌తో కలిసి స్క్రీన్‌ను పంచుకోనున్నారు. అడివి శేష్‌ హీరోగా షానియెల్‌ దేవ్‌ తెరకెక్కిస్తున్న 'డెకాయిట్‌' సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తున్నట్టు తెలియజేస్తూ మేకర్స్‌ పోస్టర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. తనకు ద్రోహం చేసిన తన మాజీ ప్రియురాలిపై ప్రతీకారం తీర్చుకునే స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.

'అవును ప్రేమించావు. కానీ మోసం చేసావు. ఇడిచిపెట్టను.. తేల్చాల్సిందే' అని అడివి శేష్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. దీనికి 'అవును వదిలేశాను. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను' అని మృణాల్‌ మరో పోస్టర్‌తో బదులు ఇచ్చారు. కాగా ఈ మొదట ఈ మూవీలో హీరోయిన్‌గా శ్రుతిహాసన్‌ను అనుకున్నారు. కాగా సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్ హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. దర్శకుడు అడివి శేష్‌తో కలిసి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో షూటింగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు.

Next Story