విజయ్ దేవరకొండతో మృణాల్ ఠాకూర్

Mrunal Thakur not Pooja Hegde opposite Vijay Deverakonda. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ నానితో ఓ సినిమాలో నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ త్వరలో విజయ్ దేవరకొండతో

By Medi Samrat
Published on : 13 Jun 2023 7:51 PM IST

విజయ్ దేవరకొండతో మృణాల్ ఠాకూర్

సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ నానితో ఓ సినిమాలో నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ త్వరలో విజయ్ దేవరకొండతో కూడా జత కట్టబోతూ ఉంది. మృణాల్ ఠాకూర్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో స్క్రీన్ షేర్ చేసుకోనుందని ఫిలింనగర్ వర్గాలు అంటూ ఉన్నాయి. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ రాబోతున్న‌ది. పరశురామ్​ దర్శకత్వం వహించనున్నాడు. గీత‌గోవిందం త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పటికే ఖుషి, గౌత‌మ్ తిన్న‌నూరి ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉన్నాడు. ఖుషి సినిమాలో స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తోంది. శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఉన్నాడు. వీటితో పాటే పరశురామ్ తో సినిమా చేయబోతూ ఉన్నాడు విజయ్ దేవరకొండ.

ఈ సినిమాలో మొదట పూజా హెగ్డేను హీరోయిన్ గా అనుకున్నారు. అయితే పూజా హెగ్డే ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక మృణాల్ ఠాకూర్ కు ఈ అవకాశం దక్కిందని చెబుతూ ఉన్నారు. సీతా రామం తర్వాత మృణాల్ తెలుగులో ఏ సినిమాలో కనిపిస్తుందా అని అందరూ ఎదురుచూస్తూ ఉన్న సమయంలో ఆమె వరుసగా రెండు సినిమాలకు సైన్ చేసేసింది. ప్రస్తుతం ఆమె నాని 30వ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కొత్త చిత్రంలో మృణాల్ కనిపించబోతోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. మృణాల్ ను లీడ్ రోల్ లో తీసుకుంటున్నట్లు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.


Next Story