క్యాన్సర్ బారిన పడిన బాలీవుడ్ హీరోయిన్.. ఆస్పత్రిలో చేరిక
Model-actress Rozlyn Khan diagnosed with cancer.బాలీవుడ్ నటి రోజ్లిన్ ఖాన్ క్యాన్సర్ బారిన పడింది.
By తోట వంశీ కుమార్ Published on 12 Nov 2022 12:03 PM ISTబాలీవుడ్ నటి రోజ్లిన్ ఖాన్ క్యాన్సర్ బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆస్పత్రిలో ఉన్న ఫోటోతో పాటు ఎమోషనల్ పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. క్యాన్సర్.. తన జీవితంలో ఓ భాగం మాత్రమేనని చెప్పింది. ప్రతి ఎదురుదెబ్బ తనను బలంగా మారుస్తుందని, వచ్చే ఏడు నెలల పాటు కీమో థెరఫీ చేయించుకోవాల్సి ఉందని తెలిపింది.
"ప్రస్తుతం మెడనొప్పి, బ్యాక్ పెయిన్ తప్పించి ఏం లేదు. ఫస్ట్ ఇది జిమ్ వల్ల వచ్చిన నొప్పి అనుకున్నాను. ఏదైతేనేం ప్రారంభంలో దీన్ని గుర్తించగలిగాం. డియర్ బ్రాండ్స్.. ప్రతి నెల 2వ వారం షూట్ కి అందుబాటులో ఉంటాను. రాబోయే ఏడు నెలల్లో ప్రతినెలా కీమోథెరపీ చేయించుకోవాలి. ప్రతి సెషన్ తర్వాత వారం రెస్ట్ కావాలి. మీకు బాల్డ్ మోడల్ తో పనిచేయాలంటే చాలా ధైర్యం కావాలి. ప్రస్తుతానికైతే రోజుకోసారి లైవ్ లోకి వస్తాను" అని రోజ్లిన్ ఖాన్ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన పలువురు నెటీజన్లు, నటీనటులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
రోజ్లిన్ ఖాన్.. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. పెటా తరుపున రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించింది. ఐపీఎల్ కోసం ఫోటోషూట్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. 2012లో 'దమా చౌక్డీ' అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం బుల్లితెరపై కూడా సత్తా చాటింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది.
ఇదిలా ఉంటే.. క్యాన్సర్‌ను జయించిన వారిలో సోనాలి బింద్రే, మనీషా కొయిరాలా, గౌతమి, మమతా మోహన్ దాస్ హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు.