విషాదం.. నటి పూనమ్‌ పాండే కన్నుమూత

బాలీవుడ్‌ నటి, మోడల్‌ పూనమ్‌ పాండే (32) నిన్న రాత్రి చనిపోయినట్లు ఆమె బృందం ప్రకటించింది. గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది.

By అంజి
Published on : 2 Feb 2024 12:34 PM IST

actor Poonam Pandey, cervical cancer, Bollywood

విషాదం.. నటి పూనమ్‌ పాండే కన్నుమూత

బాలీవుడ్‌ నటి, మోడల్‌ పూనమ్‌ పాండే (32) నిన్న రాత్రి చనిపోయినట్లు ఆమె బృందం ప్రకటించింది. గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. ఆమె స్వగ్రామం కాన్పూర్‌లోనే తుదిశ్వాస విడిచినట్టు పేర్కొన్నారు. 'ఈ ఉదయం మాకు కష్టతరమైనది. మా ప్రియమైన పూనమ్‌ను గర్భాశయ క్యాన్సర్‌తో కోల్పోయామని మీకు తెలియజేయడానికి చాలా బాధపడుతున్నాం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన పూనమ్‌ 2013లో 'నషా' సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. పలు హిందీ సినిమాల్లో నటించారు. ప్రముఖ నటి కంగనా రనౌత్‌ హోస్ట్‌గా వ్యవహరించిన లాకప్‌ తొలి సీజన్‌లో పాల్గొన్నారు. 2011 వన్డే ప్రపంచకప్‌ టోర్నీ సందర్భంగా చేసిన ఓ ప్రకటనతో పూనమ్‌ చాలా పాపులర్‌ అయ్యింది. ఆమె వివాహ జీవితం కూడా వివాదాస్పదమైంది. భర్త తనను శారీరకంగా చిత్రహింసలకు గురిచేశాడంటూ అప్పట్లో పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

Next Story