మిథున్‌ చక్రవర్తికి దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు

ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి (74) దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది.

By అంజి  Published on  30 Sept 2024 10:17 AM IST
Mithun Chakraborty, Dadasaheb Phalke Award, Bollywood

మిథున్‌ చక్రవర్తికి దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు

ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి (74) దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. మిథున్‌ చక్రవర్తికి.. కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రకటించారు. అక్టోబర్‌ 8న ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ మేరకు కేంద్ర సమాచార & ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. మిథున్‌ చక్రవర్తి 1976లో సినీ ప్రస్థానం ప్రారంభించారు. నటుడు, నిర్మాతగా సేవలు అందించారు.

మిథున్ చక్రవర్తి అద్భుతమైన సినిమా ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే ఎంపిక జ్యూరీ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తికి భారతీయ సినిమా సహకారం కోసం అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించడం గౌరవంగా ఉందని అన్నారు. అక్టోబర్ 8, 2024న జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో నటుడిని ఈ అవార్డుతో సత్కరిస్తారు.

Next Story