గర్భంతో జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్

Mister Mummy Official Trailer. కొత్త కొత్త సబ్జెక్ట్స్ తో సినిమాలు వస్తూ ఉన్న సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  29 Oct 2022 7:45 PM IST
గర్భంతో జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్

కొత్త కొత్త సబ్జెక్ట్స్ తో సినిమాలు వస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తే సినిమా చూడడానికి మూవీ లవర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఓ వినూత్న ఐడియాతో వస్తున్న చిత్రమే 'మిస్టర్ మమ్మీ'. ఈ సినిమాలో జెనీలియా, ఆమె భర్త రితేష్ దేశ్ ముఖ్ కలిసి నటించారు. మగవారికి కూడా ప్రెగ్నెన్సీ వస్తే ఏమవుతుందనే క్రేజీ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా ఇది. ఈ విషయాలన్నీ ట్రైలర్ లో చూపించేశారు.


రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా జంటగా మిస్టర్ మమ్మీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రకటన ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్‌ని క్రియేట్ చేయగా, ఇప్పుడు మేకర్స్ సినిమా ట్రైలర్‌ను వదిలారు. రితీష్ దేశ్‌ముఖ్ జీవితంలో జరిగే క్రేజీ పరిస్థితుల చుట్టూ కథ తిరుగుతుంది. మిస్టర్ మమ్మీ అనే సినిమా చాలా ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోంది. ఈ సినిమా నవంబర్ 11న విడుదలకానుంది. సాథియా (2002), బంటీ ఔర్ బబ్లీ (2005), ఓకే జాను (2017), సూర్మ (2018) మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించిన షాద్ అలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను టి-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు.


Next Story