ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్
‘మిరాయ్’ సినిమా ఓటీటీలో విడుదల కానుంది.
By - Knakam Karthik |Published on : 4 Oct 2025 5:27 PM IST

ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్
‘మిరాయ్’ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా దక్షిణాది భాషల ఓటీటీ హక్కులను జియో హాట్ స్టార్ దక్కించుకుంది. ఈ నెల 10 నుంచి స్ట్రీమింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులోకి రానుంది.
తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించారు. థియేట్రికల్ రన్‌లో మిరాయ్ రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ ఏడాది టాలీవుడ్ లో టాప్ కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. యాక్షన్ సీన్స్, విజువల్ గ్రాఫిక్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఇక మిరాయ్ సినిమా హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుక్కుంది. నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయాల్సి ఉంది.
Next Story