బన్నీ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించ‌నున్న మంత్రి తలసాని.. మొదటి సినిమా ఏమిటంటే?

Minister Talasani Srinivas Yadav to inaugurate Allu Arjun Multiplex. హైదరాబాద్ లో బాగా ఫేమస్ అయిన సత్యం థియేటర్ స్థానంలోనే

By Medi Samrat
Published on : 12 Jun 2023 1:26 PM IST

బన్నీ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించ‌నున్న మంత్రి తలసాని.. మొదటి సినిమా ఏమిటంటే?

హైదరాబాద్ లో బాగా ఫేమస్ అయిన సత్యం థియేటర్ స్థానంలోనే అల్లు అర్జున్ అండ్ ఆసియన్ సినిమాస్ కలిసి AAA సినిమాస్ పేరిట ఆసియన్ సత్యం మాల్ ని లాంచ్ చేయబోతున్నారు. ఈ మాల్ ఓపెనింగ్ జూన్ 15న జరగబోతుంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లు అర్జున్ ఈ మాల్ ని ప్రారభించబోతున్నారు. జూన్ 14న పూజా కార్యక్రమం జరగనుంది.

AAA సినిమాస్ ప్రత్యేకతలు ఏంటంటే.. మొత్తం 5 స్క్రీన్స్ అందుబాటులో ఉండబోతున్నాయి. మొదటి స్క్రీన్.. బార్కో లేజర్ ప్రొజెక్షన్ అండ్ ATMOS సౌండ్ కలిగి ఉంటే, సెకండ్ స్క్రీన్.. ఎపిక్ లుజోన్ స్క్రీన్ అండ్ ATMOS సౌండ్ కలిగి ఉంటుంది. ఇక మిగిలిన మూడు స్క్రీన్స్.. 4K ప్రొజెక్షన్ తో ఉండబోతున్నాయి. అలాగే మొత్తం స్క్రీన్స్ Dolby 7.1 సౌండ్ తో రాబోతున్నాయి. సత్యం మాల్ లో పాపులర్ ఫుడ్ బ్రాండ్స్ తో బిగ్ ఫుడ్ కోర్ట్ ని కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు.

ఈ థియేటర్ జూన్ 15వ తేదీన ప్రారంభం కానుంది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ థియేటర్‌ను ప్రారంభించనున్నారు. ఏషియన్ సత్యం మాల్‌లో అల్లు అర్జున్, ఏషియన్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్, మురళీ మోహన్, సదానంద్ గౌడ్ భాగస్వాములుగా ఉండనున్నారు. మూడు లక్షల చదరపు అడుగుల్లో రూపొందిన ఈ మాల్‌లో మూడు ఫ్లోర్ల పార్కింగ్ ఉండనుంది. జూన్ 14వ తేదీన దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. జూన్ 15వ తేదీన మాల్, సినిమాస్, ఫుడ్ కోర్ట్ ఓపెన్ కానున్నాయి. జూన్ 16వ తేదీన విడుదల కానున్న ‘ఆదిపురుష్’ సినిమానే ఇందులో ప్రదర్శితం అయ్యే మొదటి చిత్రంగా నిలవనుంది.


Next Story