కూతురు సినిమా రంగ ప్రవేశంపై.. స్పందించిన మంత్రి రోజా

Minister Roja reacts on her daughter's entry into films. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా తన పుట్టినరోజు సందర్భంగా.. ఇవాళ తిరుమలకు వెళ్లి

By అంజి
Published on : 17 Nov 2022 2:39 PM IST

కూతురు సినిమా రంగ ప్రవేశంపై.. స్పందించిన మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా తన పుట్టినరోజు సందర్భంగా.. ఇవాళ తిరుమలకు వెళ్లి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో జబర్దస్త్‌ టీమ్ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా.. తిరుమల ఆలయాన్ని సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన పుట్టిన రోజు నాడు శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రార్థనలు చేశానన్నారు.

స్వామి వారి దివ్య రూపాన్ని ఎన్నిసార్లు చూసినా మర్చిపోలేనిదని మంత్రి రోజా అన్నారు. వైఎస్ జగన్ ఆశీస్సులతో రాజకీయాల్లో విజయవంతంగా దూసుకెళ్తున్నానని ఆమె అన్నారు. తన కొడుకు, కూతురు సినిమా రంగంలోకి వస్తే చాలా సంతోషిస్తానని చెప్పిన మంత్రి రోజా, తన కూతురు అన్షు సైంటిస్ట్ కావాలనుకుంటున్నారని, చదువులో బాగా రాణిస్తోందని అన్నారు. తన కుమార్తెకు నటనా రంగంలోకి రావాలనే ఆలోచన లేదని ఆమె అన్నారు. ఒక వేళ వస్తే.. ఒక తల్లిగా, హీరోయిన్‌గా తనకు అండగా నిలబడతానని చెప్పారు. జబర్దస్త్ కమెడియన్ వర్ష, గాయని మంగ్లీ తదితరులు ఆమె వెంట ఉన్నారు.

Next Story