ఘనంగా హీరోయిన్‌ మెహ్రీన్‌ నిశ్చితార్థం.. ఫోటోలు వైర‌ల్‌

Mehreen Pirzada gets engaged to Bhavya Bishnoi.కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 March 2021 4:45 AM GMT
ఘనంగా హీరోయిన్‌ మెహ్రీన్‌ నిశ్చితార్థం.. ఫోటోలు వైర‌ల్‌

'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ' చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ మెహ్రీన్ ఫిర్జాదా. అందంతో పాటు అభిన‌యంతో అభిమానుల‌ను ఆకట్టుకుంది. కాగా.. ఈ పంజాబీ ముద్దుగుమ్మ త‌న జీవితంలో మ‌రో అంకానికి శ్రీకారం చుట్టింది. శుక్ర‌వారం ఆమె వివాహ నిశ్చితార్థం జైపూర్‌లోని అలీలా కోటలో బంధు మిత్రుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. మెహ్రీన్‌, భ‌వ్య బిష్ణోయ్ ఒక‌రికొక‌రు ఉంగ‌రాలు మార్చుకున్నారు. ఈ ఏడాదిలోనే వీరి వివాహాన్ని జ‌రిపేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి నిశ్చితార్థ వేడుక‌కు సంబంధించిన ఫోటోల‌ను మెహ్రీన్ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంది.

ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ ఈ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. నెటీజ‌న్లు ఆమెకు విషెస్ చెబుతున్నారు. మీ జంట చూడ ముచ్చ‌ట‌గా ఉంద‌ని కామెంట్లు పెడుతున్నారు. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మ‌న‌వ‌డు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్‌ కుమారుడే ఈ భవ్య బిష్ణోయ్‌. ఇదిలా ఉంటే మెహ్రీన్ ప్ర‌స్తుతం ఎఫ్ 3 చిత్రంలో న‌టిస్తోంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో వెంకీ, వ‌రుణ్‌తేజ్ హీరోలుగా న‌టిస్తున్నారు.


Next Story