పెరట్లో ఆనపకాయల‌ను చూసి చిరు ఆనందం.. వీడియో వైర‌ల్‌

Megastar Chiranjeevi wishes to Farmers.పెర‌ట్లో ఉన్న ఆన‌ప‌కాయ‌ల‌(సోర‌కాయ‌)ను చూసి మెగాస్టార్ చిరంజీవి ఎంతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Dec 2021 6:31 AM GMT
పెరట్లో ఆనపకాయల‌ను చూసి చిరు ఆనందం.. వీడియో వైర‌ల్‌

పెర‌ట్లో ఉన్న ఆన‌ప‌కాయ‌ల‌(సోర‌కాయ‌)ను చూసి మెగాస్టార్ చిరంజీవి ఎంతో సంబ‌ర‌ప‌డిపోతున్నారు. అదేంటీ..? ఆన‌ప‌కాయ‌ల‌ను చూసి చిరంజీవి సంతోష ప‌డ‌డం ఏంటీ అని అనుకుంటున్నారా..? నిజంగా నిజం అండి బాబూ. జాతీయ రైతు దినోత్స‌వం సంద‌ర్భంగా చిరంజీవి షేర్ చేసిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ వీడియోలో చిరంజీవి ఆన‌ప‌కాయ‌ల‌ను చూసి ఆనందం వ్య‌క్తం చేశారు.

అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. చిరంజీవి త‌న పెర‌ట్లో కొద్ది రోజుల క్రితం స్వ‌యంగా ఓ ఆన‌ప‌కాయ విత్త‌నాన్ని నాటారు. అది పెరిగి పాదుగా మారింది. ఓ రెండు కాయ‌ల‌ను కాసింది. తాను నాటిన విత్తనం మొక్క‌గా మారి ఎదిగి కాయ‌లు కాసేస‌రికి.. వాటిని చూసి చిరంజీవి ఆనందంలో మునిగిపోయారు. చిరంజీవి పోస్ట్ చేసిన ఆ సెల్ఫీ వీడియోలో ఆయన తెల్లటి చొక్కా ధరించి.. గార్డెన్ లో నడుస్తూ కనిపించారు. త‌న‌కు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అని చెబుతూ.. ఆ రెండు ఆన‌ప‌కాయ‌ల‌ను స్వ‌యంగా కోశారు. వాటిని చేతిలో ప‌ట్టుకుని రైతుల‌కు సెల్యూట్ చేశారు.

ప్రకృతి ఎంత గొప్పదో చూడండి మనం చిన్న విత్తనాన్ని వేస్తే ఇంత పెద్ద కూరగాయలను మనకి అందించింది. ప్రకృతికి మనం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి అని చెప్పారు. ఇక మార్కెట్లో కొన్నవాటికంటే ఇలా సొంతంగా పండించిన కూరగాయలు ఎంతో రుచిగా ఉంటాయన్నారు. 'పెర‌ట్లో ఆన‌ప‌కాయ కాస్తేనే నాకు ఇంత సంతోష‌మ‌నిపిస్తే.. మ‌ట్టి నుంచి పంట పండించి, మ‌నంద‌రికీ అన్నం పెట్టే రైతు ఇంకెంత సంతోషంగా ఉండాలి. అలా ఉండేలా మ‌న‌మే చూసుకోవాలి. వ్య‌వ‌సాయం చేస్తూ మ‌నంద‌రికీ సాయం చేస్తున్న ప్ర‌తి ఒక్క రైతుకి నా సెల్యూట్' అని జాతీయ రైతు దినోత్స‌వం సంద‌ర్భంగా రైతుల‌కు చిరంజీవి శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. చిరంజీవి న‌టించిన 'ఆచార్య' చిత్రం ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల కానుండగా.. మ‌రో నాలుగు చిత్రాల‌తో చిరు ప్ర‌స్తుతం పుల్ బిజీగా ఉన్నారు. మోహ‌న్‌రాజాతో 'లూసిఫ‌ర్' రీమేక్‌, మెహ‌ర్ ర‌మేశ్‌తో 'వేదాళం' రీమేక్‌, బాబీతో మ‌రో ప్రాజెక్టు ప‌ట్టాలెక్కించారు.

Next Story