మ‌న‌సును క‌లిచి వేస్తున్నాయి.. తిరుప‌తి వ‌ర‌ద‌ల‌పై చిరు ట్వీట్‌

Megastar Chiranjeevi tweet on Tirupati floods.ఆధ్యాత్మిక నగరం తిరుమల తిరుపతి జ‌ల ప్ర‌య‌ళంలో చిక్కుకున్న సంగ‌తి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Nov 2021 3:06 PM IST
మ‌న‌సును క‌లిచి వేస్తున్నాయి.. తిరుప‌తి వ‌ర‌ద‌ల‌పై చిరు ట్వీట్‌

ఆధ్యాత్మిక నగరం తిరుమల తిరుపతి జ‌ల ప్ర‌య‌ళంలో చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా భ‌క్తుల‌తో పాటు స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా అక్క‌డ నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన మనసును కలిచివేశాయి అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

'గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనసును కలచివేస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం, టీటీడీలు కలిసికట్టుగా కృషి చేసి సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితుల్ని నెలకొల్పాలి. అన్ని రాజకీయ పక్షాలు, అలాగే అభిమాన సంఘాలు సైతం చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నాను' అని చిరంజీవి అన్నారు.

సినీ న‌టి మంచు ల‌క్ష్మీ సైతం తిరుప‌తి వ‌ర‌ద‌ల‌పై స్పందించారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా అక్క‌డ ప‌రిస్థితులు అత‌లాకుత‌లంగా మారాయ‌ని.. ఇప్ప‌ట్లో తిరుప‌తికి వెళ్లొద్ద‌ని ప్ర‌జ‌ల‌ను ఆమె కోరారు. ప్ర‌స్తుతం అక్క‌డ ఉన్న ప‌రిస్థితిని తెలియ‌జేస్తూ ఓ వీడియోని షేర్ చేశారు. తిరుప‌తిలో నెల‌కొన్న ప‌రిస్థుల‌కు ఇది ఓ నిద‌ర్శ‌నం. తిరుప‌తి చుట్టు ప్ర‌క్క‌ల ప్రాంతాల్లో ఉన్న వారు జాగ్ర‌త్త‌గా ఉండండి. మీ వాళ్లు ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నారో ఓసారి ఫోన్ చేసి వాక‌బు చేయండి. ప్ర‌కృతి ఉగ్రరూపం దాల్చింది అంటూ ట్వీట్ చేశారు.

Next Story