ఢిల్లీలో మెగాస్టార్.. ఈరోజు ఎంతో స్పెషల్
మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీకి చేరుకున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 May 2024 9:15 AM ISTఢిల్లీలో మెగాస్టార్.. ఈరోజు ఎంతో స్పెషల్
మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీకి చేరుకున్నారు. దిగ్గజ నటుడైనచిరంజీవి భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం, ప్రతిష్టాత్మకమైన 'పద్మవిభూషణ్' నేడు అందుకోనున్నారు. ఆయనకు కొద్దిరోజుల కిందట ప్రభుత్వం అధికారికంగా పద్మ విభూషణ్ ను ప్రకటించింది. సినిమా రంగానికి చేసిన విశిష్ట సేవకు గానూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు ప్రతిష్టాత్మకమైన అవార్డును బహుకరిస్తారు. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో.. ఆయన 150కి పైగా చలనచిత్రాలలో నటించారు. వెంకయ్య నాయుడు, వైజయంతిమాల, పద్మా సుబ్రమణ్యం, బిందేశ్వర్ పాఠక్ (మరణానంతరం) ఆయనతో పాటు పద్మవిభూషణ్‌ను అందుకోనున్నారు.
ఈ అవార్డు కార్యక్రమంలో భాగమవ్వడానికి మెగాస్టార్ చిరంజీవి బుధవారం దేశ రాజధాని ఢిల్లీకి బయలు దేరారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసనతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది.