చిరంజీవి పేరులోని మార్పును గ‌మ‌నించారా..?

Megastar Chiranjeevi changes his name spelling.మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ పుల్ బిజీగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 July 2022 4:49 PM IST
చిరంజీవి పేరులోని మార్పును గ‌మ‌నించారా..?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ పుల్ బిజీగా ఉన్నారు. ఆయ‌న న‌టిస్తున్న చిత్రాల్లో 'గాడ్ ఫాద‌ర్' చిత్రం ఒక‌టి. సోమ‌వారం ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, చిన్న వీడియోను విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. ఈ వీడియోలో చిరంజీవి త‌న పేరులో చిన్న‌పాటి మార్పులు చేసుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

త‌న పేరును మొత్తం కాకుండా E అనే అక్ష‌రాన్ని అద‌నంగా చేర్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు Chiranjeevi అనే పేరు ఉండ‌గా.. తాజాగా Chiranjeeevi గా ఆ వీడియోలో క‌నిపిస్తోంది. ఈ పేరు మార్పు వెనుక న్యూమ‌రాల‌జిస్టుల స‌ల‌హా ఉంద‌ని అంటున్నారు. గతంలో చాలా మంది నటీనటులు, హీరో,హీరోయిన్స్ తమ పేర్లలో స్పెల్లింగ్‌లను మార్చుకున్న సంగ‌తి తెలిసిందే.

Next Story