క‌ళ్యాణ్ బాబుకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు.. చిరంజీవి ట్వీట్ వైర‌ల్‌

Mega Star Chiranjeevi wishes to Pawan kalyan on his birthday.నేడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Sept 2022 10:31 AM IST
క‌ళ్యాణ్ బాబుకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు.. చిరంజీవి ట్వీట్ వైర‌ల్‌

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ప‌వ‌ర్‌.. ఈ పేరు చాలు ఇంకా ఏమీ అవ‌స‌రం లేదు. భారీ డైలాగ్‌లు చెప్ప‌క‌పోయినా, క‌ళ్లు చెదిరే డ్యాన్సులు చేయ‌క‌పోయినా.. కేవ‌లం ఆయ‌న క‌టౌట్ క‌నిపిస్తే చాలు ప్రేక్ష‌కులు ఉర్రూత‌లూగుతారు. థియేట‌ర్ల‌లో పండ‌గ చేసుకుంటారు. తెర‌పై ఎంతో హంగామా చేసే ప‌వ‌ర్ స్టార్‌.. తెర వెనుక మాత్రం చాలా సాదాసీదాగా ఉంటారు. అందుక‌నే స‌గ‌టు సినీ అభిమానితో పాటు అంద‌రూ ఆయ‌న్ను ఇష్ట‌ప‌డుతుంటారు.

కాగా.. నేడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు. రాత్రి నుంచే ఫ్యాన్స్ హంగామా మొద‌లైంది. కేక్స్ క‌ట్ చేస్తూ గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల ప‌వ‌న్ పోస్ట‌ర్ల‌ల‌కు పాలాభిషేకాలు చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అటు సినీ ప్ర‌ముఖులు, ఇటు రాజ‌కీయ నాయ‌కుల నుండి సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌వ‌న్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

'త‌న ఆశ‌, ఆశ‌యం ఎల్ల‌ప్పుడూ జ‌న‌హిత‌మే. తాను న‌మ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్త శుద్ధితో శ్ర‌మించే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆశ‌యాల‌న్నీ నెర‌వేరాల‌ని కోరుకుంటూ, ఆశీర్వ‌దిస్తూ, క‌ళ్యాణ్ బాబుకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తున్నాను' అంటూ చిరంజీవి ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం చిరంజీవి చేసిన ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

'నా గురువు, నా బ‌లం ప‌వ‌న్ కళ్యాణ్ మామకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. ప్రేమ‌, ఆరోగ్యం మ‌రియు ఆనందంతో ప్రతిరంగంలో రాణించాల‌ని కోరుకుంటున్నాను' - సాయి ధ‌ర‌మ్ తేజ్ ట్వీట్ చేశాడు.

'ఈ విశ్వంలో సూర్యుడు ఒక్క‌డే, చంద్రుడు ఒక్క‌డే ప‌వ‌న్ ఈశ్వ‌రుడు ఒక్క‌డే. మా దేవ‌ర‌కు జన్మ‌దిన శుభాకాంక్ష‌లు' - బండ్ల గ‌ణేష్

Next Story