సీఎం జ‌గ‌న్‌తో ముగిసిన మెగాస్టార్ చిరంజీవి భేటీ

Meeting completed between Mega star Chiranjeevi and CM Jagan.ఏపీ సీఎం జ‌గ‌న్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ముగిసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jan 2022 3:23 PM IST
సీఎం జ‌గ‌న్‌తో ముగిసిన మెగాస్టార్ చిరంజీవి భేటీ

ఏపీ సీఎం జ‌గ‌న్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ముగిసింది. సుమారు గంట‌న్న‌ర పాటు స‌మావేశం అయ్యారు. ఈ భేటీలో సినిమా ప‌రిశ్ర‌మ‌కు సంబందించిన అనేక అంశాలపై చ‌ర్చించారు. సినిమా ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను సీఎం జ‌గ‌న్‌కు చిరంజీవి వివ‌రించారు. ముఖ్యంగా టికెట్ ధ‌ర‌ల అంశాన్ని చిరంజీవి, సీఎం జ‌గ‌న్ దృష్టికి తీసుకువ‌చ్చారు. టికెట్ ధ‌ర‌ల‌ను పెంచాల‌ని కోరారు. సినీ ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌త్యేక ప్రోత్సాహ‌కాలు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. క‌రోనా కార‌ణంగా సినీ కార్మికులు క‌ష్టాల్లో ఉన్నార‌ని వారిని ఆదుకోవాల‌ని కోరారు. స‌మావేశం అనంత‌రం చిరంజీవి నేరుగా గ‌న్న‌వ‌రం విమానాశ్రయానికి బ‌య‌లుదేరి వెళ్లారు.

అంత‌క‌ముందు గురువారం హైద‌రాబాద్‌లోని బేగంపేట విమానాశ్ర‌యం నుంచి ప్ర‌త్యేక విమానంలో చిరంజీవి గ‌న్న‌వ‌రం వ‌చ్చారు. ఎయిర్‌పోర్టులో దిగ‌గానే చిరంజీవిని మీడియా ప‌లుక‌రించింది. ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సినీ ప‌రిశ్ర‌మ‌ బిడ్డ‌గా సీఎంతో మాట్లాడుతాన‌ని చెప్పారు. భేటి త‌రువాత అన్ని విష‌యాలు వెల్ల‌డిస్తానని చెప్పారు. ఎయిర్‌పోర్టు నుంచి తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యానికి చేరుకున్నారు. చిరంజీవిని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌ను చిరంజీవి శాలువాతో స‌త్క‌రించారు.

Next Story