'గుంటూరు కారం' నుంచి మరో లీక్.. పూజా ప్లేస్‌లో ఆ హీరోయిన్
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా 'గుంటూరు కారం'. ఈ సినిమా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది.
By అంజి Published on 17 July 2023 8:21 AM IST'గుంటూరు కారం' నుంచి మరో లీక్.. పూజా ప్లేస్‌లో ఆ హీరోయిన్
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా 'గుంటూరు కారం'. ఈ సినిమా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమాని గ్రాండ్‌గా లాంచ్ చేసినా చాలా రోజులు అవుతున్నా.. పలు కారణాల వల్ల సినిమా షూటింగ్ సగం కూడా పూర్తి కాలేదు. పూజా హేగ్దే, శ్రీలీలను హీరోయిన్స్‌గా తీసుకోగా.. పూజా హెగ్దే ఈ సినిమా నుంచి తప్పుకుంది. అయితే డేట్స్ అడ్జస్ట్ అవ్వకే 'గుంటూరు కారం' సినిమా నుంచి పూజా తప్పుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత ఆ ప్లేస్‌లో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. చివరకు ఓ హీరోయిన్‌తో ఇటీవలే షూట్ మొదలుపెట్టారు. అయితే అధికారికంగా ఆ హీరోయిన్ ఎవరనేది మాత్రం చిత్రయూనిట్ బయటపెట్టలేదు. కానీ తాజాగా హీరోయిన్ మీనాక్షి చౌదరి తనే ఈ సినిమాలో చేస్తున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
విజయ్ ఆంటోనీతో కలిసి మీనాక్షి చౌదరి నటించిన తాజా చిత్రం 'హత్య'. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో మీనాక్షి చౌదరి మాట్లాడింది. గుంటూరు కారం సినిమాలో పనిచేయడం చాలా గొప్పగా ఉందన్న మినాక్షి.. తాను మహేష్ బాబుకి పెద్ద అభిమానిని చెప్పింది. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తయిందని, షూటింగ్ లో మహేష్ బాబుతో మొదటి రోజు, మొదటి షాట్ మర్చిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చింది. ఈ సినిమా విషయంలో తాను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అని ప్రకటించింది. దీంతో గుంటూరు కారం సినిమాలో పూజాహెగ్డే ప్లేస్ లో మీనాక్షి చౌదరిని తీసుకున్నట్టు క్లారిటీ వచ్చేసింది. హిట్, ఖిలాడీ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మీనాక్షి చౌదరి మెప్పించింది.