అభిమానులు గెట్ రెడీ.. 'మ.. మ.. మహేషా.. 'మాస్ సాంగ్

Mass Song from Sarkaru Vaari Paata movie release tomorrow.సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2022 12:28 PM IST
అభిమానులు గెట్ రెడీ.. మ.. మ.. మహేషా.. మాస్ సాంగ్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం 'స‌ర్కారు వారి పాట‌'. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టిస్తోంది. 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పోస్టర్లు, క‌ళావ‌తీ, పెన్నీ పాట‌లు,ట్రైలర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశాయి. ఈ చిత్రంలో ఓ మాస్ సాంగ్‌లో మ‌హేష్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టేశాడ‌ని చిత్ర బృందం చెప్పిన‌ప్ప‌టి నుంచి ఈ పాట ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇందుకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర బృందం ఇచ్చింది.

చిత్రంలోని 'మ.. మ.. మహేషా..' అనే మాస్ సాంగ్ ని రేపు శనివారం (మే 7న ) విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. దీంతో పాటు మాస్ పోస్టర్ ను విడుద‌ల చేసింది. పోస్టర్ లో మహేష్, కీర్తి సురేష్ కలర్ ఫుల్ డ్రెస్ లో ఒక మాస్ స్టెప్పు వేస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Next Story