మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. నవంబర్ 28 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
రవితేజ కెరీర్‌లో 75వ చిత్రంగా ఎన్నో అంచనాల మధ్య ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ తన ప్రకటనలో తెలిపింది.