మంగళవారం ట్రైలర్.. మామూలుగా లేదుగా
ఆర్ఎక్స్100 సినిమాతో సంచలన హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి.
By Medi Samrat Published on 21 Oct 2023 7:30 PM ISTఆర్ఎక్స్100 సినిమాతో సంచలన హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి. ఆ సినిమా తర్వాత మహా సముద్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా అనుకున్నంత విజయం అందుకోలేకపోతోంది. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో తీసిన సినిమా మంగళవారం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది. మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
‘మంగళవారం’ సినిమా టైటిల్‍తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. టీజర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఆర్ఎక్స్100 భామ పాయల్ రాజ్‍పుత్ కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం భయపెట్టేలా, ఉత్కంఠభరితంగా ఉంది. గ్రామంలో ప్రతీ మంగళవారం కొందరు చనిపోతుంటారు. తర్వాతి మంగళవారం ఎవరు చనిపోతారోనని గ్రామస్తులు భయపడుతుంటారు. చావులను ఆపేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు.. చివరికి ఏమైందనే సస్పెన్స్ తో ట్రైలర్ ను కట్ చేశారు. కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అజ్నీశ్ లోకనాథ్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌కు ప్లస్ గా మారింది. థియేటర్లలో ఇంకా మంచి ఫీల్ రానుంది.
మంగళవారం సినిమాలో పాయల్ రాజ్‍పుత్, నందితా శ్వేత, దివ్యా పిళ్లై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోశ్ శ్రవణ్ రెడ్డి కీలకపాత్రలు పోషించారు. నవంబర్ 17వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.