ముందుగా వచ్చేస్తున్న 'మంగళవారం'

'మంగళవారం' సినిమా రిలీజ్ డేట్ కంటే ముందే విడుదల కాబోతోంది. ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్‌లను ప్రదర్శించనున్నారు.

By Medi Samrat  Published on  15 Nov 2023 5:30 PM IST
ముందుగా వచ్చేస్తున్న మంగళవారం

'మంగళవారం' సినిమా రిలీజ్ డేట్ కంటే ముందే విడుదల కాబోతోంది. ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్‌లను ప్రదర్శించనున్నారు. అందుకు సంబంధించి బుకింగ్‌లు మొదలయ్యాయి. సినిమా మీద ఉన్న కాన్ఫిడెంట్ తో చాలా వరకూ మీడియం-బడ్జెట్ సినిమాలకు పెయిడ్ ప్రీమియర్‌ లు వేస్తున్నారు. ఆ బాటలో మంగళవారం చిత్ర యూనిట్ కూడా ముందుకు వచ్చింది. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'మంగళవారం' టీమ్ నవంబర్ 16న తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్లను ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో మంగళవరం సినిమా పెయిడ్ ప్రీమియర్‌ లకు సంబంధించిన బుకింగ్‌లు ఇప్పటికే తెరిచారు. తెలంగాణలో కూడా బుకింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ నడుస్తోంది. ప్రీమియర్స్ నుండి మంచి మౌత్ టాక్ వస్తే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంటుందని చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. 'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం మంగళవారం. ఈ సినిమా రిలీజ్ కు ముందు మంచి హైప్ ను క్రియేట్ చేసింది. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించిన ఈ చిత్రం నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.

Next Story