మా ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన మంచు విష్ణు
Manchu Vishnu manifesto for MAA elections.మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు రాజకీయ ఎన్నికలను
By తోట వంశీ కుమార్ Published on 7 Oct 2021 11:06 AM GMTమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. 'మా' అధ్యక్ష బరిలో నిలిచిన అభ్యర్థులు, ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. ఇక మరో మూడు రోజుల్లో మా ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మా ఎన్నికల్లో అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు తమ మేనిఫెస్టోను ప్రకటించారు. తాము గెలిస్తే ఏమేం చేస్తారో వివరించి మా సభ్యులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సొంత ఖర్చుతో మా నూతన భవనం నిర్మిస్తామని, రెండు తెలుగు ప్రభుత్వాలతో మాట్లాడి అర్హులైన ఆర్టిస్టులకు సొంత ఇల్లు వచ్చేలా చూస్తామన్నారు.
విష్ణు ప్యానెల్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు
- నటీనటులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి. ఇందుకోసం ప్రత్యేకంగా మా యాప్ కు రూపకల్పన. డైరెక్టర్లు, నిర్మాతలు, రచయితలు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ ను ఈ యాప్ తో అనుసంధానం చేస్తాం.
- ప్రత్యేకంగా జాబ్ కమిటీ ఏర్పాటు. నిర్మాతలు, నిర్మాణ సంస్థలు, ఓటీటీ వేదికల వద్దకు వెళ్లి తమ జాబితాలో ఉన్న నటీనటులకు అవకాశాలు ఇచ్చేలా ఈ జాబ్ కమిటీ ప్రయత్నాలు చేస్తుంది. అవకాశాలు లేని నటీనటులకు ప్రాధాన్యం.
- నా సొంత డబ్బుతో మా భవనం నిర్మిస్తాం. మా భవనం కోసం మూడు స్థలాలు చూశాం.
- నటీనటుల సొంత ఇంటి కలను నెరవేరుస్తాం. ప్రభుత్వంతో మాట్లాడి మా సభ్యులకు సొంత ఇల్లు ఇప్పించే హామీ నాది.
- అర్హులైన సభ్యులకు పెళ్లి ఖర్చుల కోసం రూ.1,16,000 వరకు సాయం చేస్తాం.
-అర్హులైన మా సభ్యుల పిల్లలకు కేజీ టు పీజీ వరకు విద్యాసాయం