మంచు కుటుంబంలో విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. మోహన్‌బాబు తన ముగ్గురు పిల్లలకు ఆస్తులు పంచేయగా, విద్యా సంస్థల్లో వాటాపై మనోజ్ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ అంశంపైనే శనివారం రాత్రి డైలాగ్ కింగ్ తన నివాసంలో తన కుమారులతో భేటీ అయ్యారు. గొడవ జరగడంతో మోహన్‌బాబు అనుచరుడు వినయ్.. మనోజ్‌పై దాడి చేసినట్టు సమాచారం. దీంతో అతను ఫోన్ చేయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారని, ఆ తర్వాత కాంప్రమైజ్ అయినట్టు చెప్పడంతో వెళ్లిపోయారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే మంచు ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది.
నిన్న హీరో మంచు మనోజ్ బంజారాహిల్స్‌లోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాలికి గాయం కావడంతో నడిచేందుకు ఇబ్బంది పడుతున్న మనోజ్ భార్య మౌనిక సాయంతో ఆస్పత్రి వెళ్లి వచ్చారు. మనోజ్ శరీరంపై అనుమానాస్పద గాయాలు గుర్తించినట్టు వైద్యులు తెలిపారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. దీంతో ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసే అవకాశం ఉంది. వైద్యుల సూచన మేరకు మనోజు నేడు మరోసారి ఆస్పత్రికి వెళ్తారని సమాచారం. అయితే దాడి ఘటనను మంచు కుటుంబ సభ్యులు ఖండించారు.