వాట్సాప్ తెచ్చిన కొత్త ప్రైవసీ పాలసీపై ఆందోళనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన వాట్సాప్ మరో మూడు నెలల పాటు పాలసీని వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. మంచు ఫ్యామిలీని వాట్సాప్ హ్యాకర్లు టార్గెట్ చేసినట్లే కనిపిస్తోంది. మొన్నటికి మొన్న సంక్రాంతికి నటి మంచు లక్ష్మీ వాట్సాప్ హ్యాక్ కాగా.. నేడు ఆమె తమ్ముడు మంచు మనోజ్ వాట్సాప్ కూడా హ్యాక్ చేశారు.
ఈ విషయాన్ని మంచు మనోజ్ సోషల్ ట్విట్టర్‌లో వెల్లడించారు. తన వాట్సాప్ హ్యాక్ అయిందని.. తన వాట్సప్ నుంచి వచ్చే వాటికీ దయచేసి రెస్పాండ్ కావద్దంటూ అంటూ.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ & ఫ్యాన్స్ కు కోరాడు మంచు మనోజ్. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది. కావాలనే మంచు ఫ్యామిలీని టార్గెట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రస్తుతం చాలా మంది వాట్సాప్ ను వదిలి సిగ్నల్‌కు మారుతుండగా.. మంచు మనోజ్‌ను కూడా సిగ్నల్‌కు మారమని నెటీజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవలే మంచు లక్ష్మి వాట్సాప్ కూడా హ్యాక్ కు గురైన సంగతి తెలిసిందే. మంచు లక్ష్మి కూడా సోషల్ మీడియా స్పందిస్తూ.. తన వాట్సాప్ హ్యాక్ కి గురైయిందని, దయచేసి ఎవరు తన నుంచి వాట్సాప్ చాట్ కు ఎవరు స్పందించవద్దు అని కోరిన విషయం తెలిసిందే. ఆమె సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీల సోషల్ మీడియా ఖాతాలు హాక్ అవుతున్న సంగతి తెలిసిందే.