మంచు మ‌నోజ్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌.. ఏ జ‌న్మ‌పుణ్య‌మో అంటూ

త‌న‌ను పెళ్లి కొడుకు చేస్తున్న అక్క మంచు ల‌క్ష్మీ ఫోటోను షేర్ చేస్తూ మంచు మ‌నోజ్ బావోద్వేగానికి లోనైయ్యాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 March 2023 1:43 PM IST
Manchu Manoj, Manchu Lakshmi,

మంచు మ‌నోజ్ పెళ్లి వేడుక ఫోటోలు

టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్‌, భూమా మౌనిక రెడ్డి మెడ‌లో మూడు ముళ్లు వేశాడు. శుక్ర‌వారం రాత్రి వీరి వివాహాం ఫిల్మ్‌న‌గ‌ర్‌లోని మంచు ల‌క్ష్మీ నివాసంలో చాలా ఘ‌నంగా జ‌రిగింది. ఇరువురు కుటుంబ స‌భ్యులు, అతి కొద్ది మంది స‌న్నిహితులు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో వీరి వివాహాం జ‌రిగింది.

కాగా.. త‌మ్ముడు మంచు మ‌నోజ్ అంటే అక్క మంచు ల‌క్ష్మీకి ఎంతో ఇష్టం అన్న సంగ‌తి తెలిసిందే. తనను కొడుకులా చూసుకుంటానని ప‌లు సంద‌ర్భాల్లో చెప్పింది కూడా. ఈ క్ర‌మంలోనే అన్నీ తానై పెళ్లి పెద్దగా మారి అన్ని పనులు దగ్గరుండి చూసుకుంది.

మంచు మ‌నోజ్‌ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ

ఈ నేప‌థ్యంలో అక్క గురించి మ‌నోజ్ ఓ ఎమోష‌న‌ల్ నోట్ షేర్ చేశాడు. తనని పెళ్లి కొడుకు చేస్తున్న మంచు లక్ష్మి ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘అక్కా.. ఏ జన్మ పుణ్యమో నాది. లవ్యూ అక్క. థ్యాంక్స్‌ ఫర్‌ ఎవ్రీథింగ్‌’ అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెటింట వైర‌ల్‌గా మారింది. అక్క -త‌మ్ముడు అంటే మీలాగే ఉండాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story