భూమా మౌనిక మెడ‌లో మూడు ముళ్లు వేసిన మంచు మ‌నోజ్‌

మంచు మ‌నోజ్, భూమా మౌనికారెడ్డి వివాహ‌బంధంతో ఒక్క‌టి అయ్యారు.శుక్ర‌వారం రాత్రి 8.30 గంట‌ల‌కు వీరి పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 March 2023 7:58 AM IST
Manchu Manoj,Manchu Manoj Marriage

మంచు మ‌నోజ్ పెళ్లి ఫోటోలు

టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్, భూమా మౌనికారెడ్డి వివాహ‌బంధంతో ఒక్క‌టి అయ్యారు. శుక్ర‌వారం రాత్రి 8.30 గంట‌ల‌కు మంచు ల‌క్ష్మీ నివాసంలో వీరి పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. వేద మంత్రాల సాక్షిగా మౌనిక మెడ‌లో మ‌నోజ్ మూడు ముళ్లు వేశాడు. అతి కొద్ది మంది అతిథుల స‌మ‌క్షంలో వీరి వివాహం జ‌రిగింది. టీజీ వెంకటేశ్, కోదంరామిరెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, నిక్కీ గల్రానీ, దేవినేని అవినాశ్, వైఎస్ విజ‌య‌మ్మ‌, తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్ర‌స్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. నెటీజ‌న్లు కొత్త జంట‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.


మనోజ్‌కు 2015లో ప్రణతిరెడ్డితో వివాహమైంది. అయితే.. మనస్పర్థలు కారణంగా 2019లో పరస్పర అంగీకారంతో విడిపోయారు. దివంగత భూమా నాగిరెడ్డి-శోభానాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికా రెడ్డికి గతంలో బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తతో పెళ్లి జ‌రిగి విడాకులు అయ్యాయి. గతేడాది వినాయకచవితి సందర్భంగా మనోజ్-మౌనిక ఇద్దరూ హైదరాబాద్‌లోని ఓ మండపం వద్ద ప్రత్యేక పూజలు చేస్తూ కనిపించారు. ఇక అప్ప‌టి నుంచి వీరిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్ర‌చారం జ‌రిగింది. శుక్ర‌వారం ఉద‌యం పెళ్లి కూతురు అంటూ మౌనికా రెడ్డి ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసి అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేశాడు మ‌నోజ్‌.

Next Story