'ఎంబీయూలో ఆర్థిక అవకతవకలు'.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు
తన కుటుంబం కోసం 8 ఏళ్లు సినిమాల్లో కష్టపడ్డానని మంచు మనోజ్ అన్నారు. కొన్నాళ్లుగా ఇంటి నుంచి తమ కుటుంబం దూరంగా ఉంటోందన్నారు. '
By అంజి Published on 10 Dec 2024 7:09 AM IST'ఎంబీయూలో ఆర్థిక అవకతవకలు'.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు
తన కుటుంబం కోసం 8 ఏళ్లు సినిమాల్లో కష్టపడ్డానని మంచు మనోజ్ అన్నారు. కొన్నాళ్లుగా ఇంటి నుంచి తమ కుటుంబం దూరంగా ఉంటోందన్నారు. ''నా ముందే నా కుటుంబ సభ్యుల్ని, ఉద్యోగుల్ని తిట్టారు. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజీ మాయం చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయి. అందులోని బాధితులను నేను అండగా ఉన్నాను. అందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు'' అని మనోజ్ అన్నారు.
తన తండ్రి మోహన్ ఆబు ఎప్పుడూ విష్ణుకే మద్ధతుగా ఉన్నారని మనోజ్ అన్నారు. తన త్యాగాలు ఉన్నా.. తనకు అన్యాయం, పరువు నష్టం జరిగిందన్నారు. కుటుంబ వివాదాల పరిష్కారం కోసం చర్చలు జరపాలని తన నాన్నను కోరినా పట్టించుకోలేదని తెలిపారు. తాను 4 నెలల క్రితమే ఇంటికి వచ్చాననేది అవాస్తవమని, తన ఫోన్ లోకేషన్ చూస్తే ఇది తెలుస్తుందన్నారు. తనపై తన భార్యపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, తన పరువు, మర్యాద తీసే ప్రయత్నంలో భాగం అని లేఖలో రాశారు.
అటు మోహన్ బాబు రాచకొండ కమీషనర్‌కి ఇచ్చిన ఫిర్యాదుపై మంచు మనోజ్ స్పందించారు. తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మనోజ్ కోరారు. కుటుంబ ఆస్తుల కోసం తాను ఏనాడూ ఆశ పడలేదన్నారు. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానని, .ఈ వివాదాల్లోకి తన కూతుర్ని కూడా లాగడం చాలా బాధాకరంగా ఉందనీ అన్నారు. గత కొన్నాళ్ల నుంచి ఇంటి నుంచి మా కుటుంబం దూరం గానే ఉంటున్నామన్నారు.
''నేను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులా లేదు..ఆస్తులు కావాలని ఎప్పుడూ ఎవ్వరిని బావపెట్టలేదు...ఇబ్బంది పెట్టలేదు.. నేను నా భార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదిం చుకుంటున్నాం. విద్యాసంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి. విద్యాసంస్థలోని బాధితులకు నేను అండగా ఉన్నాను. బాధితుల పక్షాన నిలబడ్డందుకు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు'' అని మంచు మనోజ్ ఆవేదన వ్యక్తంచేశారు.