మోహన్‌బాబు ఇంటి బయట బైఠాయించిన మనోజ్.. తండ్రితో మాట్లాడాలని డిమాండ్

సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారి తీసింది.

By Knakam Karthik
Published on : 9 April 2025 12:07 PM IST

Cinema News, Tollywood, Entertainment, Manchu Mohanababu, Manoj, Vishnu

మోహన్‌బాబు ఇంటి బయట బైఠాయించిన మనోజ్, తండ్రితో మాట్లాడాలని డిమాండ్

సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారి తీసింది. గత కొన్ని రోజులుగా మంచు మనోజ్, విష్ణు, మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా కూడా మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలోని మోహన్ బాబాఉ నివాసం ఇంటి వద్దకు మంచు మనోజ్ వెళ్లారు. గత కొన్ని రోజులుగా మంచు మనోజ్ తన కుటుంబంతో కలిసి బయటనే ఉంటున్నారు. అయితే తాజాగా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. తనకు ఇంట్లోకి వెళ్లేందుకు మనోజ్ ప్రయత్నించారు. దీంతో మనోజ్‌ను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ఆయన ఇంటి బయటే బైఠాయించారు. తన తండ్రి మోహన్ బాబుతో మాట్లాడాలని మనోజ్ డిమాండ్ చేశారు.

అయితే తన కారును సోదరుడు మంచు విష్ణు తీసుకెళ్లాడని మరోవైపు మంచు మంచు మనోజ్ ఇప్పటికే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఊరిలో లేనప్పుడు తన వస్తువులన్నీ తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఇంటి ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మోహన్ బాబు ఇంటి నుంచి రెండు కిలో మీటర్ల మేర ఆంక్షలు విధించారు. భారీగా మోహరించారు.

Next Story