ఘ‌నంగా 'మ‌న‌సంతా నువ్వే' సుహాని పెళ్లి.. ఫోటోలు వైర‌ల్‌

Manasantha Nuvve Fame Suhani Kalita wedding photos goes viral.బాల‌న‌టిగా మ‌న‌సంతా నువ్వే చిత్రంలో తూనీగా తూనీగా.. ఎందాక

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Sept 2022 8:06 AM IST
ఘ‌నంగా మ‌న‌సంతా నువ్వే  సుహాని పెళ్లి.. ఫోటోలు వైర‌ల్‌

బాల‌న‌టిగా 'మ‌న‌సంతా నువ్వే 'చిత్రంలో 'తూనీగా తూనీగా.. ఎందాక ప‌రిగెడ‌తావే' అంటూ పాట పాడి తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో నిలిచింది సుహాని క‌లిత‌. బాల న‌టిగానే కాకుండా హీరోయిన్‌గా ప‌లు చిత్రాల్లో న‌టించి మెప్పింది. తాజాగా అమ్మ‌డు పెళ్లిపీటలెక్కింది. ఢిల్లీకి చెందిన మోటివేష‌న‌ల్ స్పీక‌ర్, సంగీత‌కారుడు విభ‌ర్ హ‌సీజాని పెళ్లాడింది. అతి కొద్ది మంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో వీరి వివాహా వేడుక ఇటీవ‌ల జ‌రుగగా.. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కొత్త జంట‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు నెటీజ‌న్లు. 'యువర్స్ ఈవెంట్‌ఫుల్లీ' అనే కంపెనీకి విభర్ సీఈవో అని సమాచారం.


'బాల రామాయ‌ణం' చిత్రంతో సుహాని తెర‌గ్రేటం చేసింది. 'గణేశ్', 'ప్రేమంటే ఇదేరా', 'ఎదురులేని మనిషి', 'ఎలా చెప్పను' వంటి ప‌లు చిత్రాల్లో బాల‌న‌టిగా న‌టించి మెప్పించింది. తెలుగుతో పాటు త‌మిళం, హిందీ, బెంగాలీ బాష‌ల్లోనూ న‌టించింది. 2008లో స‌వాల్ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. 'స్నేహ‌గీతం' చిత్రంలో చివ‌ర‌గా క‌నిపించింది. గ‌త కొంత కాలంగా ఆమె సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు.



Next Story