'మెగా' సత్తా ఇది.. రెండు రోజుల్లో 100 కోట్లు..!

'మన శంకరవరప్రసాద్‌ గారు' సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్ ను సాధిస్తోంది.

By -  Medi Samrat
Published on : 14 Jan 2026 12:13 PM IST

మెగా సత్తా ఇది.. రెండు రోజుల్లో 100 కోట్లు..!

'మన శంకరవరప్రసాద్‌ గారు' సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్ ను సాధిస్తోంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రెండు రోజుల కలెక్షన్స్‌ను అధికారికంగా తెలిపారు. రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ పాజిటీవ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో చిరంజీవితో పాటు వెంకటేశ్‌, నయనతార, కేథరిన్‌ థ్రెసా, సచిన్‌ ఖేడ్కేర్ తదితరులు నటించారు. ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు.

చిరంజీవి, అనిల్ రావిపూడిల 'మన శంకర వర ప్రసాద్ గారు' 2వ రోజు కూడా అద్భుతంగా దూసుకుపోయింది. కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్‌ను దాటింది. సంక్రాంతి పండుగ ప్రారంభం కావడంతో, ఆదివారం వరకు ఈ చిత్రం భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది.

Next Story