థియేటర్ వద్ద గన్‌తో యువకుడి హల్‌చల్
Man hulchul with a gun in Movie Theatre in Pithapuram.ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియానే కొనసాగుతోంది.
By తోట వంశీ కుమార్ Published on
25 March 2022 9:25 AM GMT

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియానే కొనసాగుతోంది. థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని అన్నపూర్ణ థియేటర్ వద్ద ఓ యువకుడు తుపాకీతో హల్ చల్ చేశాడు. ఓ పక్క థియేటర్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రం షో నడుస్తుండగా.. సదరు యువకుడు తెర ముందు గన్‌తో ఫోజులు కొడుతూ.. తెర ముందు అటూ ఇటూ తిరిగాడు. దీంతో సినిమా చూద్దామని వచ్చిన ప్రేక్షకులు అతడి తీరుతో షాక్ తిన్నారు. ఆ తరువాత అతడు థియేటర్ బయట గన్‌తో తిరుగుతుతూ ఫోజులిస్తుండగా.. గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అయితే.. అది డమ్మీ తుపాకి అని సదరు యువకుడు చెబుతున్నాడు.
ఇక సినిమా విషయానికి వస్తే.. చరణ్, ఎన్టీఆర్‌లు నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు సినిమా అదుర్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు పెడుతున్నారు.
Next Story