ఆ హీరోయిన్‌కు అరుదైన వ్యాధి.. అయ్యో ఇలా మారిపోయిందేంటి
Mamta Mohandas diagnosed with vitiligo.. shares note on 'embracing the journey'. హీరోయిన్ మమతా మోహన్‌దాస్ మళ్లీ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోంది.
By అంజి Published on 16 Jan 2023 9:15 AM ISTహీరోయిన్ మమతా మోహన్‌దాస్ మళ్లీ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. కొంతకాలం క్రితమే క్యాన్సర్ నుంచి కోలుకున్న మమతా మోహన్‌దాస్.. మళ్లీ అరుదైన వ్యాధి బారిన పడటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యమదొంగ సినిమాలో స్పెషల్ రోల్‌తో ఆకట్టుకున్న మమతా.. వరుస ఆఫర్లు రావడంతో తెలుగు నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గానే కాకుండా గాయనిగా కూడా అలరించింది ఈ మళయాళీ కుట్టీ. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోషకాహార నిపుణురాలిగా ఎంతో మందికి దిశానిర్దేశం చేస్తున్నారు.
తాజాగా ఈ అమ్మడు.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షాకింగ్ పోస్ట్ చేసింది. తాను చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని చెప్పింది. దీని కారణంగా చర్మంపై తెల్లని మచ్చలు ఏర్పడుతున్నాయని, అయితే ప్రస్తుతం చికిత్స తీసుకుంటానని మమతా చెప్పింది. ఇన్‌స్టాలో మేకప్ లేకుండా దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. చర్మం రంగును కోల్పోయేలా చేసే క్రానిక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది.
''ప్రియమైన సూర్యుడా.. నాకు మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు నీ కాంతి నాకు అవసరం. నేను రంగును కోల్పోతున్నాను.. పొగమంచు నుండి వచ్చే మెరిసే మొదటి సూర్య కిరణాన్ని చూడడానికి నేను ప్రతి ఉదయం మీ కంటే ముందే లేస్తాను. అవి నాకు కావాలని వాటి కోసం బయటకు వస్తున్నాను. ఎందుకంటే వాటితో నాకు చాలా అవసరం ఉంది. మీ దయతో ఇక్కడ ఉన్నాను. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను'' అని ఆమె రాసింది. ఆమె పోస్ట్ చేసిన వెంటనే స్నేహితులు, అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.