ఏజెంట్ మూవీ నుంచి 'మళ్లీ మళ్లీ నువ్వే' సాంగ్ రిలీజ్
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ పత్తి సురేందర్ రెడ్డి పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'ఏజెంట్'.
By అంజి Published on 23 Feb 2023 6:44 PM ISTఏజెంట్ మూవీ నుంచి 'మళ్లీ మళ్లీ నువ్వే' సాంగ్ రిలీజ్
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ పత్తి సురేందర్ రెడ్డి పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'ఏజెంట్'. సమ్మర్ సీజన్‌లో విడుదలకానున్న పలు పాన్ ఇండియా సినిమాల్లో ఇది ఒకటి. 'ఏజెంట్' మూవీని ఏప్రిల్ 28 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా.. మేకర్స్ ఫస్ట్ సింగిల్ 'మళ్లీ మళ్లీ'ని గురువారం విడుదల చేశారు. ఈ పాటను అఖిల్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. మొట్టమొదటిసారిగా యువ హీరో అఖిల్ ట్విట్టర్‌లో తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు. పాటను ప్రత్యేకమైన రీతిలో ప్రారంభించాడు.
ఈ పాట ఇప్పటికే ప్రోమో వెర్షన్‌తో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ సాంగ్‌లో అఖిల్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మెస్మరైజ్ చేశాడు. ఎక్స్‌ప్రెషన్స్, ఎట్రాక్టివ్ డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌తో ప్రేక్షకులను అఖిల్ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ సాక్షి వైద్య కూడా చాలా అందంగా కనిపించింది. సినిమాలో వీరి కెమిస్ట్రీ వీక్షకుల్ని కట్టిపడేసేలా ఉంది. తాజాగా విడుదలైన సాంగ్‌ను బ్యూటీఫుల్ లోకేషన్స్, విజువల్స్‌తో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా అఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని సినిమా విశ్లేషకులు అంటున్నారు.
A song that captured my heart and will now capture yours too… https://t.co/PLViIqUca7 Here's #MalliMalli from #Agent...#AgentOnApril28th @DirSurender @sakshivaidya99 @hiphoptamizha @AKentsOfficial @AnilSunkara1 @S2C_Offl @LahariMusic @TSeries
— Akhil Akkineni (@AkhilAkkineni8) February 22, 2023
సురేందర్ రెడ్డి అఖిల్‌ను మునుపెన్నడూ చూడని విధంగా ప్రెజెంట్ చేస్తున్నారు. మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రసూల్ ఎల్లోర్ కెమెరా వర్క్ చూసుకుంటున్నారు. ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా విడుదల కానున్న ఈ చిత్రానికి అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి సహ నిర్మాతలు.