మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఒక హోటల్ మూడవ అంతస్తు నుండి దూకి పారిపోయాడు. అతను డ్రగ్స్ వాడే అవకాశం ఉందని వచ్చిన సమాచారం మేరకు పోలీసు బృందం అతడు ఉంటున్న హోటల్ కు వచ్చింది. ఆ సమయంలో చాకో కిటికీ గుండా తప్పించుకుని, రెండవ అంతస్తులోకి దూకాడు, ఆ తర్వాత మెట్ల మీద నుండి పారిపోయాడు. ఈ ఛేజింగ్ సమయంలో అతడికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు చాకో కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు, కానీ అతను కనిపించకుండా ఉన్నాడు.
గతంలో ఓ డ్రగ్స్ కేసులో నిర్దోషిగా బయటపడ్డాడు చాకో. 2015లో అతనిపై నమోదైన కేసులో షైన్ టామ్ చాకోను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఇటీవల షైన్ టామ్ చాకో మరో వివాదం చిక్కుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ సెట్‌లో డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ ఆరోపణలు చేస్తోంది. ఈ విషయమై షైన్ టామ్ చాకోపై కేరళ ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు అమ్మ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు.