రోడ్డుప్ర‌మాదంలో గాయ‌ప‌డిన బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా.. అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

Malaika Arora injured in car accident.బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా ప్ర‌యాణిస్తున్న కారు రోడ్డు ప్ర‌మాదానికి గురైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 April 2022 2:35 AM GMT
రోడ్డుప్ర‌మాదంలో గాయ‌ప‌డిన బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా.. అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా ప్ర‌యాణిస్తున్న కారు ప్ర‌మాదానికి గురైంది. ఈ ఘ‌ట‌న‌లో ఆమెకు గాయాలు అయ్యాయి. వెంట‌నే ఆమెను న‌వీ ముంబైలోని అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. మ‌లైకా నుదిపై స్వ‌ల్పంగా గాయాల‌య్యాయని, మ‌లైకా ఇప్పుడు ఆరోగ్యంగానే ఉంద‌ని అపోలో వైద్యులు తెలిపారు. సీటీ స్కాన్‌లోనూ అంతా బాగానే ఉంద‌న్నారు. ఈ రోజు(ఆదివారం) ఆమెను డిశ్చార్జ్ చేస్తామ‌ని తెలిపారు.

మలైకా అరోరా శనివారం మధ్యాహ్నం పూణెలో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా ఖలాల్‌పూర్ టోల్ ప్లాజా స‌మీపంలో ఈ రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. మలైకా ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని మ‌లైకా అరోరా సోదరి అమృతా అరోరా కూడా మీడియాకు తెలిపారు. ముంబయి-పుణే ఎక్స్‌ప్రెస్‌ హైవేపై మూడు కార్లు ఒక దానిని మరొకటి ఢీకొన్న ఘటనలో మలైకా గాయపడినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో మలైకా తన డ్రైవర్, బాడిగార్డ్ తో కలిసి ప్రయాణిస్తున్నారు.

Next Story
Share it