Rao Ramesh look In KGF Chapter 2 . 'కేజీఎఫ్ 2' లో కన్నెగంటి రాఘవన్ పాత్రను రావు రమేష్ పోషిస్తూ ఉన్నారు. ఆయనకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి చిత్ర యూనిట్ .
By Medi Samrat Published on 25 May 2021 8:29 AM GMT
కేజీఎఫ్-2 సినిమా కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! మొదటి భాగాన్ని మించే స్థాయిలో కేజీఎఫ్-2 ఉండబోతోందని టీజర్ ను చూస్తేనే అర్థం అవుతుంది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా డ్యూరేషన్ 2గంటల 52 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తుంది. సినిమా విడుదల లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అవుతుందేమోనని భయాలు కూడా అభిమానుల్లో ఉన్నాయి. ఆ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ తో పాటూ, తెలుగు నటుడు రావు రమేష్ కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఆయన పుట్టినరోజు కారణంగా కేజీఎఫ్ చిత్ర బృందం ఓ పోస్టర్ ను విడుదల చేసింది.
'కేజీఎఫ్ 2' లో కన్నెగంటి రాఘవన్ పాత్రను రావు రమేష్ పోషిస్తూ ఉన్నారు. ఆయనకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి చిత్ర యూనిట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. రావు రమేష సీబీఐ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఆయనకు పుట్టినరోజు విషెష్ ను తెలియజేస్తూ ఆయనకు సంబంధించిన డీటైలింగ్ ను పోస్టులో ఉంచింది చిత్ర యూనిట్.
బాలీవుడ్ నటుడు సంజయ్ 'అధీరా' పాత్రలో కనిపించనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే చిత్ర టీజర్ సంచనలం సృష్ఠించిన సంగతి తెలిసిందే. మిలియన్ల కొద్దీ వ్యూస్ తో టీజర్ దూసుకుపోతోంది.
Wishing the versatile actor #RaoRamesh sir a very safe Happy Birthday.